బ్యాంకాక్‌లోని ఆసియాన్ సమావేశంలో భాగంగా.. ఆర్సెప్ ఒప్పందంపై సంప్రదింపులు ఎంతో స్ఫూర్తివంతమైన పురోగతిని సాధించాయని అభిప్రాయపడింది చైనా. అయితే ఈ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం.. సభ్య దేశాల అంచనాలను ఇంకా అందుకోలేదని తెలిపింది.
ఒప్పందం కుదిరితే.. చైనా చౌక ధర సరుకులు భారత్‌లోకి వెల్లువెత్తుతాయని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేసిన కొన్ని రోజులకు డ్రాగన్ దేశం ఈ ప్రకటన చేసింది.
'ఒప్పందం కుదుర్చుకోవడానికి సాగిన చర్చలు.. సభ్యదేశాల అంచనాలు అందుకోలేకపోయాయి. కానీ ఈసారి ఎంతో స్ఫూర్తివంతమైన పురోగతి సాధించాం. త్వరగా ఒప్పందంపై సంతకాలు చేయడానికి సభ్యదేశాలు కృషి చేయాలని నిర్ణయించాయి.'
--- జెంగ్ షుయాంగ్, చైనా విదేశాంగ ప్రతినిధి.