తెలంగాణ

telangana

By

Published : May 18, 2021, 5:36 AM IST

Updated : May 18, 2021, 7:21 PM IST

ETV Bharat / international

'మేధో హక్కుల'పై భారత్​ సూచనకు చైనా మద్దతు

వ్యాక్సిన్ల తయారీని వేగవంతం చేసేందుకు ట్రిప్స్ నిబంధనలను నిలిపివేయాలన్న భారత్, దక్షిణాఫ్రికా విజ్ఞప్తికి చైనా మద్దతు ప్రకటించింది. పెద్ద ఎత్తున వ్యాక్సిన్ తయారీ జరిపేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.

Zhao Lijian
జావో లిజియాన్, చైనా విదేశాంగ ప్రతినిధి

టీకా తయారీ వేగవంతం కోసం ట్రిప్స్(వర్తక సంబంధిత మేధో హక్కులు) నిబంధనలు రద్దు చేయాలంటూ భారత్, దక్షిణాఫ్రికా చేసిన విజ్ఞప్తికి మద్దతు పలికింది చైనా. కొవిడ్​ కట్టడికి శాయశక్తులా కృషిచేస్తామని తెలిపింది.

అభివృద్ధి చెందుతున్న 60 దేశాల తరఫున.. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వేదికగా ట్రిప్స్ నిబంధనలు సడలించాలని భారత్​, దక్షిణాఫ్రికా విజ్ఞప్తి చేశాయి.

'టీకాల ఉత్పత్తికి ప్రపంచ దేశాలు ఎంతలా ఆకాంక్షిస్తున్నాయో చైనా అర్థం చేసుకోగలదు' అని చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్ తెలిపారు. భారత్, దక్షిణాఫ్రికా పేర్లు చెప్పకుండా పరోక్షంగా మద్దతు పలికారు. 10 అభివృద్ధి చెందిన దేశాల సహకారంతో వ్యాక్సిన్ తయారీ ముడిపదార్థాలు పొందుతున్నట్లు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున వ్యాక్సిన్ తయారీ జరిపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఐరోపా దేశాలు, అమెరికా కూడా భారత్, దక్షిణాఫ్రికా విజ్ఞప్తికి ఇటీవలే ఆమోదం తెలిపాయి.

ఇదీ చదవండి:గాజాపై దాడి- ఖండించిన అంతర్జాతీయ సమాజం

Last Updated : May 18, 2021, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details