చైనా పర్యటనకు వచ్చే విదేశీయులు తప్పసరిగా తమ దేశంలో తయారైన కొవిడ్ టీకాను వేసుకొనే రావాలని ఆ దేశం నిబంధన విధించింది. ఈ మేరకు ఇప్పటికే ఆ దేశానికి చెందిన విదేశీ రాయబార కార్యాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. చైనాకు రావాలనుకునే.. విద్యార్థులు, ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరికి తమ దేశ రాయబార కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశామని ఓ ప్రకటనలో తెలిపింది.
'మా టీకా వేసుకుంటేనే దేశంలోకి అనుమతి' - విదేశీయులకు చైనా రూల్స్
కరోనా కట్టడిలో భాగంగా చైనా కఠిన చర్యలు అవలంబిస్తోంది. ఇందులో భాగంగా.. విదేశాల నుంచి చైనాకు వచ్చే వారు తప్పనిసరిగా తమ దేశంలో తయారైన కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే ఆ దేశానికి చెందిన విదేశీ రాయబార కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.
'ఆ టీకా వేసుకుంటేనే చైనాలోకి రావాలి'
వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం ధృవపత్రాన్ని ఇస్తారని చైనా ప్రభుత్వం చెప్పింది. మార్చి 15 నుంచే భారత్‌లోని చైనా రాయబార కార్యాలయంలో చైనాకి చెందిన వ్యాక్సిన్‌ని అందుబాటులో ఉంచారు. తమ దేశీయ వ్యాక్సిన్ వేయించుకున్న వారి వీసాలనే పరిశీస్తామని చైనా స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:ఆస్ట్రాజెనెకా టీకాపై ఎందుకీ అనుమానాలు?