తెలంగాణ

telangana

ETV Bharat / international

భూటాన్​తో సరిహద్దు గొడవకు చైనా ప్యాకేజీ పరిష్కారం!

భూటాన్​తో సరిహద్దు వివాదానికి ప్యాకేజీ పరిష్కారాన్ని ప్రతిపాదించింది చైనా. రెండు దేశాల మధ్య సరిహద్దులు ఇంకా నిర్ణయించలేదని వాదిస్తోంది. భూటాన్​లోని సక్​తేంగ్ వన్యప్రాణుల అభయారణ్యం తమదేననే వివాదాస్పద ప్రకటనను సమర్థించుకుంది.

China says it proposed 'package solution' to resolve border dispute with Bhutan
భూటాన్​తో సరిహద్దు వివాదానికి చైనా ప్యాకేజీ పరిష్కారం!

By

Published : Jul 21, 2020, 7:44 PM IST

భూటాన్​లోని సక్​తేంగ్ వన్యప్రాణుల అభయారణ్యం తమదేనని ఇటీవల ఆశ్చర్యకర రీతిలో ప్రకటించుకున్న చైనా.. తన వాదనను సమర్థించుకుంది. రెండు దేశాల మధ్య సరిహద్దును ఇంకా నిర్ణయించలేదని పేర్కొంది. సరిహద్దు వివాదానికి ప్యాకేజీ పరిష్కారాన్ని ప్రతిపాదించింది. ఈ విషయంపై చైనా స్పష్టమైన వైఖరితో ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్​ వెన్​బిన్​ చెప్పారు.

అయితే గ్లోబల్​ ఎన్విరాన్​మెంటల్ ఫెసిలిటీ(జీఈఎఫ్​) కౌన్సిల్ మాత్రం సక్​తేంగ్​ వన్యప్రాణుల అభయారణ్యానికి యథావిధిగా నిధులు సమకూర్చింది. ​ చైనా వాదనను భూటాన్​ కొట్టిపారేసినట్లు ప్రపంచ బ్యాంకు అధికారి అపర్ణ సుబ్రమణి చెప్పారు. భూటాన్​ సహా భారత్​, బంగ్లాదేశ్​, మాల్దీవులు, శ్రీలంక దేశాలకు ఆమె ప్రతినిధిగా ఉన్నారు.

సక్​తేంగ్ వ్యవహారంపై చైనాకు దిల్లీలోని భూటాన్ రాయబార కార్యాలయం డీమార్చీ పంపింది.

ఇదీ చూడండి: ఆ సముద్రం మీ సొత్తు కాదు: చైనాకు భారత్​ హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details