ప్రపంచంలో జనాభా పరంగా తొలిస్థానంలో ఉన్న చైనా.. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలోని 40 శాతం మందికి కరోనా టీకా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చినట్లు పేర్కొన్న చైనా వైద్య నిపుణులు.. అందుకే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనుకబడినట్లు చెప్పుకొచ్చారు. రోజూ 10 మిలియన్ల జనాభాకు టీకా వేసినప్పటికీ.. 70 శాతం మందికి పంపిణీ చేయడానికి ఏడు నెలలు పడుతుందన్నారు.
బ్రూకింగ్ సంస్థ, సింఘువా విశ్వవిద్యాలయం సోమవారం నిర్వహించిన ఆన్లైన్ సదస్సులో అమెరికా వైద్య నిపుణులతో మాట్లాడారు చైనా ఆరోగ్య కమిషన్ అధికారి ఝాంగ్ నాన్షన్. ఫిబ్రవరి 28 నాటికి దేశంలో 52.52 మిలియన్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు. 50 కోట్లకుపైగా డోసులను విదేశాలకు అందించామన్నారు.