తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్​పై పోరులో భారత్​కు సాయం చేస్తాం: చైనా - భారత్​కు ఫ్రాన్స్​ సాయం

కొవిడ్​పై పోరులో భారత ప్రభుత్వానికి, ప్రజలకు తాము సహాయ, సహకారాలు అందిస్తామని చైనా తెలిపింది. భారతీయలు త్వరలోనే కరోనా మహమ్మారిని జయిస్తారని నమ్ముతున్నట్లు తెలిపింది. మరోవైపు.. ఫ్రాన్స్​ కూడా భారత్​కు సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

corona
కొవిడ్​పై పోరులో భారత్​కు సాయం చేస్తాం: చైనా

By

Published : Apr 23, 2021, 9:57 PM IST

కరోనాపై పోరులో తాము భారత్​కు సహాయ, సహకరాలు అందిస్తామని చైనా ప్రకటించింది. కరోనా కేసుల పెరుగుదలను ఎదుర్కోవటానికి సాయం అందించే ప్రతిపాదనపై భారత ప్రభుత్వంతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.

"భారత్​లో మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సానికి మేం హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నాం. కొవిడ్​కు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత ప్రభుత్వానికి, ప్రజలకు చైనా ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. భారత్​ అవసరాలను బట్టి మేము సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. మహమ్మారిని భారత ప్రజలు త్వరలోనే విజయవంతంగా ఎదుర్కొంటారని మేం నమ్ముతున్నాం."

- ఝావో, లిజియాన్​, చైనా విదేశాంగ ప్రతినిధి

చైనాలోని వుహాన్​ నగరంలో గతేడాది డిసెంబర్​లో మొదటిసారి వెలుగు చూసిన కరోనా మహమ్మారి... వివిధ దేశాల్లో విస్తరిస్తూ, తీరని నష్టం చేకూర్చుతోంది.

సిద్ధంగా ఉన్నాం..

దేశంలో ఆక్సిజన్​ కొరత వేధిస్తున్న తరుణంలో, కొవిడ్​పై పోరాడుతున్న భారత్​కు తాము సహకారాన్ని అందించేందుకు సిద్ధం ఉన్నామని ఫ్రాన్స్​ తెలిపింది.

"కరోనా రెండో దశ విజృంభణతో పోరాడుతున్న భారతీయులకు నా సంఘీభావాన్ని పంపాలని అనుకుంటున్నాను. ఈ పోరాట సమయంలో ఫ్రాన్స్​ మీతో ఉంది. భారత్​కు సహకారాన్ని అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం."

-ఇమ్మాన్యుయేల్ మేక్రాన్​ ​​, ఫ్రాన్స్​ అధ్యక్షుడు

భారత్​లో రోజువారీ కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే.. 3.32 లక్షల మందికి కొవిడ్​ సోకినట్లు తేలింది.

ఇదీ చూడండి:భారత్​కు టీకా సాయంలో పంతం వీడని అమెరికా!

ABOUT THE AUTHOR

...view details