తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐదు దేశాల ఆరోపణలను తిప్పికొట్టిన చైనా

హాంకాంగ్​ ప్రజల హక్కుల్ని హరించేలా చైనా చేపడుతున్న చర్యలను వెంటనే ఆపేయాలని అమెరికా నేతృత్వంలోని ఐదు దేశాలు ఇచ్చిన పిలుపును డ్రాగన్​ తిప్పికొట్టింది. చైనా అభివృద్ధికి, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తే దాని పరిణామం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.

CHINA_FIVE EYES
ఐదు దేశాల ఆరోపణలను తిప్పికొట్టిన చైనా

By

Published : Nov 19, 2020, 10:20 PM IST

హాంకాంగ్​పై చైనా చేపడుతోన్న చర్యలను తిరస్కరిస్తూ అమెరికా నేతృత్వంలోని ఐదు దేశాలు చేసిన ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. ఆ ఐదు దేశాలు హాంకాంగ్​ నిజమైన స్థితిని తెలుసుకోవాలని హెచ్చరించింది.

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలు హాంకాంగ్​కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ మండిపడ్డారు.

" చైనా సార్వభౌమాధికారానికి, భద్రతకు, అభివృద్ధి కార్యకలాపాలకు భంగం కలిగించే యత్నం చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అవి ఐదు దేశాలైనా సరే..పది దేశాలైనా సరే " అని జావో లిజియాన్​ హెచ్చరించారు.

ఐదు దేశాల ఆగ్రహానికి కారణం?

హాంకాంగ్​ శాసనసభకు ప్రతినిధులుగా ఎన్నికైన నలుగురుని అనర్హులుగా ప్రకటిస్తూ చైనా కొత్త నిబంధనలు అమలు చేసింది. ఈ చర్యపై ఆగ్రహించిన అమెరికా నేతృత్వంలోని ఐదు సభ్యదేశాల విదేశాంగ మంత్రులు చైనా తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన జావో, హాంకాంగ్..​ చైనాలో అంతర్భాగమైపోయిందని అన్నారు. ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు చైనాకు కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించారు. ప్రతీ దేశంలో ఉండే రాజనీతి ఇదే కదా అని ప్రశ్నించారు.

గతంలో.. చైనా, హాంకాంగ్​ ఆంక్షల విషయంపై స్పందించాలని ఆ నలుగురు ప్రజా ప్రతినిధులు గళం విప్పారు. దీనిపై డ్రాగన్​ అసహనం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి:భారత్​ ఎదుగుదలను చూసి చైనా భయపడుతోందా?

ABOUT THE AUTHOR

...view details