సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా... లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని చైనా పేర్కొంది. ఈ విషయంపై ఇరు దేశాలు సామరస్యంగా మెలగాలని అన్నారు చైనా విదేశాంగ ప్రతినిధి హువా చునైంగ్.
పలుమార్లు సైన్యాధికారులు చర్చలు జరిపిన అనంతంరం బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైందని హువా గుర్తుచేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఎంత సమయం పడుతుందనే దానిపై స్పష్టత లేదని తెలిపారు.