చైనాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుంది. ఇప్పటివరకు 20 కోట్లమంది చైనీయులకు టీకా అందించామని ఆ దేశ వైద్యాధికారులు వెల్లడించారు. చైనా జనాబాలో ఇది 14.29 శాతంగా పేర్కొన్నారు. కరోనా యోధులకు, యూనివర్సిటీ విద్యార్థులకు, సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు టీకాలు అందించినట్లు తెలిపారు. మయన్మార్ సరిహద్దు కలిగిన రూయిలీ నగరంలో బుధవారం కేవలం రెండు కేసులే నమోదైనట్లు వివరించారు.
చైనా ఇప్పటివరకు దేశీయంగా అభివృద్ధి చేసిన ఐదు వ్యాక్సిన్లను ఆమోదించినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారి క్యూగాంగ్ తెలిపారు. ఇవి 50.7 శాతం నుంచి 79.3 శాతం వరకు సత్ఫలితాలను ఇస్తున్నట్లు వివరించారు. జనాభాలో కొన్ని కీలకమైన వర్గాల వారికి టీకాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలోని 80 శాతం వైద్య సిబ్బందికి డోసులు అందించామన్నారు.