తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా చట్టసభ్యులపై చైనా 'ప్రతీకార' ఆంక్షలు - china sanctions on us

అమెరికాకు చెందిన 11 మంది రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యవాద సంస్థల అధిపతులపై చైనా ఆంక్షలు విధించినట్లు ప్రకటించింది. హాంకాంగ్ విషయంలో వీరంతా వ్యతిరేక ప్రచారం చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వీగర్ ముస్లింలు, హాంకాంగ్ విషయాల్లో చైనా అధికారులపైనా అమెరికా గతంలో ఆంక్షలు విధించింది.

China sanctions
అమెరికా చట్టసభ్యులపై చైనా ఆంక్షలు

By

Published : Aug 10, 2020, 4:48 PM IST

అమెరికాకు చెందిన 11 మందిపై చైనా అస్పష్టమైన ఆంక్షలను విధించింది. ఈ జాబితాలో రాజకీయ నాయకులతోపాటు ప్రజాస్వామ్యవాద సంస్థల అధిపతులు ఉన్నారు. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్​ అధికారికంగా ప్రకటించారు.

హాంకాంగ్​లో జాతీయ భద్రతా చట్టానికి సంబంధించి వీరంతా వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు లిజియాన్ పేర్కొన్నారు. ఇటీవల అమెరికా ఆంక్షలు విధించిన హాంకాంగ్​, చైనా అధికారుల సంఖ్య, ప్రస్తుతం డ్రాగన్​ ప్రకటించిన వారి సంఖ్య సమానం కావటం గమనార్హం.

జాబితాలోని చట్ట సభ్యులు..

సెనెటర్లు మార్కో రుబియో, టెడ్​ క్రూజ్​, జోష్​ హావ్​లీ, టామ్ కాటన్, చట్ట సభ్యులు క్రిస్ స్మిత్ ఈ 11 మంది జాబితాలో ఉన్నారు. ఇప్పటికే రుబియో, క్రూజ్​, స్మిత్​పై గత నెలలో ప్రయాణ నిషేధం విధించింది చైనా. వీగర్​ ముస్లింలపై అణచివేతకు పాల్పడేందుకు ప్రయత్నించిన చైనా అధికారులపై అమెరికా కూడా ఇలాంటి చర్యలే తీసుకుంది.

జిమ్మీ లై అరెస్టు..

హాంకాంగ్​లో చైనా ధిక్కార స్వరాలను అణగదొక్కే ప్రయత్నాలనూ ముమ్మరం చేసింది. చైనాపై వ్యతిరేకతను తగ్గించేందుకు హాంకాంగ్ మీడియా దిగ్గజం జిమ్మీ లైను సోమవారం అరెస్టు చేసి ఆయన సంస్థలపై దాడులు చేసింది.

ఇదీ చూడండి:చైనా కక్షసాధింపు- హాంకాంగ్​ మీడియా దిగ్గజం అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details