తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాస ప్రతిపాదనను వ్యతిరేకించిన చైనా, రష్యా - ఐరాస సమావేశంలో చైనా, రష్యా

మయన్మార్​లో నిర్బంధంలో ఉన్న ప్రజాప్రతినిధులను విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి చేసిన ప్రతిపాదనను రష్యా, చైనా వ్యతిరేకించాయి. సంబంధిత తీర్మానం వేళ ఆయా దేశాల ప్రతినిధులు తప్పుకొన్నారు.

unhrc
ఐరాస ప్రతిపాదనను వ్యతిరేకించిన చైనా, రష్యా

By

Published : Feb 13, 2021, 3:58 PM IST

సైనిక పాలనలోకి వెళ్లిన మయన్మార్‌లో నిర్బంధంలో ఉన్న ప్రజాప్రతినిధులను విడుదల చేయాలంటూ ఐక్యరాజ్యసమితి చేసిన ప్రతిపాదనను రష్యా, చైనా వ్యతిరేకించాయి. ఈ మేరకు.. సంబంధిత తీర్మానం నుంచి ఆ రెండు దేశాలు బయటకు వచ్చినట్లు ఎన్​హెచ్​కే వరల్డ్​ తెలిపింది. జెనీవాలో శుక్రవారం జరిగిన.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి(యూఎన్​హెచ్​ఆర్​సీ) ప్రత్యేక సమావేశంలో ఈ తీర్మానం ఏకాభిప్రాయంతో ఆమోదం పొందినట్లు వివరించింది.

హెచ్చరించిన ఐరాస

అయితే.. ఈ తీర్మానం వచ్చిన వేళ రష్యా, చైనా ప్రతినిధులు తప్పుకొన్నారు. మయన్మార్‌లో ఆంగ్​ సాన్ సూకీ సహా దేశాధ్యక్షుడు వి-మిని తక్షణమే నిర్బంధం నుంచి విడుదల చేయాలని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది. సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణచి వేసేందుకు మయన్మార్ సైన్యం నిజమైన బుల్లెట్లు ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఐరాస తెలిపింది. ఇది సరికాదని హెచ్చరించింది.

అటు.. నేపాల్‌, హాంగ్‌కాంగ్‌సహా మరికొన్ని దేశాలు మయన్మార్‌లో పరిస్థితికి చైనానే కారణమంటూ యూఎన్​హెచ్​ఆర్​సీ సమావేశంలో నిందించాయి.

ఇదీ చదవండి:మయన్మార్​లో ఆగని పౌర నిరసనలు

ABOUT THE AUTHOR

...view details