తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనావ్యాప్తంగా 5జీ సేవలు షురూ- భారత్​లో ఎప్పుడో? - చైనావ్యాప్తంగా 5జీ సేవలు షురూ- భారత్​లో ఎప్పుడో?

ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5జీ సేవలను చైనా ప్రారంభించింది. దేశంలోని 50 ప్రముఖ నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

చైనావ్యాప్తంగా 5జీ సేవలు షురూ- భారత్​లో ఎప్పుడో?

By

Published : Nov 1, 2019, 7:31 PM IST

4జీ ఎల్​టీఈ నెట్​వర్క్​తో పోల్చితే 10 నుంచి 100 రెట్లు అధిక వేగంతో ఇంటర్నెట్​ అందించే 5జీ సేవల్ని చైనా ప్రారంభించింది. బీజింగ్​, షాంఘై​, గ్వాంగ్జౌ, షెన్​జెన్​ సహా మొత్తం 50 ప్రముఖ నగరాల్లో 5జీ నెట్​వర్క్​ను అందుబాటులోకి తెచ్చింది.

చైనావ్యాప్తంగా 5జీ సేవలు షురూ- భారత్​లో ఎప్పుడో?

5జీ ప్లాన్లు

చైనా ప్రభుత్వం పరిధిలోని 3 టెలికాం సంస్థలు ఈ 5జీ సేవలు అందిస్తున్నాయి. నెలకు 128యువాన్​ (రూ.1289) నుంచి 599 యువాన్​ (రూ. 6,030) వరకు వేర్వేరు ప్లాన్లు ప్రకటించాయి.

10 మిలియన్ల చందాదారులు...

5జీ సేవలకు విడుదలకు ముందే 10 మిలియన్ల చందాదారులు నమోదు చేసుకున్నట్లు టెలికాం సంస్థలు ప్రకటించాయి.

2025 నాటికి చైనాలో 600 మిలియన్ల 5జీ వినియోగదారులు ఉంటారని, ఇది ప్రపంచంలో 40 శాతమని విశ్లేషకులు అంచనా వేశారు.

ఇదీ చూడండి:పాకిస్థానీలకు కశ్మీర్​ కంటే ఆ రెండే అతిపెద్ద సమస్యలు

ABOUT THE AUTHOR

...view details