తెలంగాణ

telangana

ETV Bharat / international

సింగిల్ డోస్​ టీకాకు చైనా అనుమతి- అమెరికాకు పోటీగానే!

సింగిల్ డోసు టీకాకు చైనా ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు గ్లోబల్​ టైమ్స్​ పత్రిక తెలిపింది. జాన్సన్ అండ్ జాన్సన్​ సంస్థ రూపొందించిన సింగిల్​ డోస్​ వ్యాక్సిన్​కు అమెరికా-ఎఫ్​డీఏ అనుమతి ఇచ్చిన కొద్ది గంటల్లోనే చైనా అనుమతులు ఇవ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది.

China rolls out first one-jab COVID-19 vaccine: Report
సింగిల్ డోసు టీకాకు చైనా అనుమతి- అమెరికాకు పోటీగానే!

By

Published : Feb 28, 2021, 7:00 PM IST

తమ దేశంలో తొలి సింగిల్ డోసు కరోనా వ్యాక్సిన్​కు చైనా ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతినిచ్చినట్లు గ్లోబల్​ టైమ్స్​ పత్రిక.. వెల్లడించింది. జాన్సన్ అండ్ జాన్సన్​ సంస్థ రూపొందించిన సింగిల్​ డోస్​ టీకా​కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ-ఎఫ్​డీఏ అనుమతులు ఇచ్చిన కొద్ది గంటల్లోనే చైనా ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాకు పోటీగానే చైనా 'ఏడీ5-ఎన్​కోవ్' అనే​ టీకాకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

'ఏడీ5-ఎన్​కోవ్'​ టీకా మొదటి దశ క్లినికల్​ ట్రయల్స్​ను గతేడాది మార్చి 16న ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి కట్టడికి ట్రయల్స్​ ప్రారంభించిన తొలి టీకా ఇదే కావటం గమనార్హం. టీకా తీసుకున్న 14 రోజుల నుంచి పనిచేస్తుందని గ్లోబల్​ టైమ్స్​ పత్రిక వివరించింది. దాదాపు 6నెలల వరకు టీకా సంరక్షిస్తుందని పేర్కొంది. ఆరు నెలల తర్వాత రెండో డోసు తీసుకుంటే టీకా నుంచి రక్షణ రెట్టింపు స్థాయిలో ఉంటుందని తెలిపింది. ఈ టీకాను కాన్​సినో బయోలాజిక్స్​ సంస్థ, ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మిలిటరీ మెడిసిన్​ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. సంవత్సరానికి 500 మిలియన్ల మందికి​ టీకా అందించవచ్చని తయారీ సంస్థ తెలిపింది.

ఇదీ చదవండి :కొవిడ్‌ నుంచి కాపాడే వారసత్వ ప్రొటీన్‌!

ABOUT THE AUTHOR

...view details