ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న కరోనా మహమ్మారిని చైనా సమర్థవంతంగా నియంత్రిస్తోంది. తాజాగా దేశీయంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 34 మందికి ఈ అంటువ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. గత రెండు వారాల్లో అతిపెద్ద రోజువారీ పెరుగుదల ఇదేనని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది.
చైనాలో సున్నాకు చేరుకున్న కరోనా కేసులు! - coronavirus latest news china
చైనాలో తాజాగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని చైనా ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 34 మందికి ఈ మహమ్మారి వైరస్ సోకిందని స్పష్టం చేసింది.
చైనాలో సున్నాకు చేరుకున్న కరోనా కేసులు
జనవరి నుంచి కరోనాతో పోరాటం చేస్తోంది చైనా. పలు నియంత్రణ చర్యలు చేపట్టింది. ఎక్కడికక్కడ నిషాధాజ్ఞలు విధించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాల అస్త్రాలు ఉపయోగించింది.
ఇదీ చూడండి:సరిహద్దుల మూసివేతతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం
Last Updated : Mar 19, 2020, 10:15 AM IST
TAGGED:
coronavirus news