చైనాలో పుట్టిన కరోనాపై ఆ దేశం విజయం సాధించినట్లు కనిపిస్తోంది. వుహాన్ సహా పలు ప్రాంతాల్లో నెమ్మదిగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 7 మృతులు, కేవలం 8 కేసులు నమోదవ్వడం ఆ దేశానికి కాస్త ఊరట కలిగిస్తోంది.
చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(సీఎన్హెచ్సీ ) తెలిపిన వివరాల ప్రకారం తాజాగా కరోనా బారినపడి మృతిచెందిన ఏడుగురిలో ఒక్కరు మాత్రమే షాండాంగ్ ప్రావిన్స్‌కు చెందినవారు. వుహాన్‌లోనే ఆరుగురికి వైరస్‌కు బలయ్యారు. కొత్తగా నమోదైన 8 కేసులు మెయిన్‌లాండ్‌కు చెందినవి.
జయించినట్టేనా...
ప్రస్తుతం చైనావ్యాప్తంగా 80, 813 కరోనా కేసులుంటే అందులో 64,111 మంది కోలుకున్నారు. అయితే, ఇప్పటికీ చికిత్స పొందుతున్న 13,526 మందిలో 4020 మంది పరిస్థితి విషమంగా ఉంది. మిగిలినవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
గురువారం ఒక్కరోజే 1,318 మంది వైరస్‌ను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవడం కొవిడ్-19 వ్యాప్తిలో తగ్గుదలను సూచిస్తోంది. ఈ వివరాలతో కరోనా వ్యాప్తి నియంత్రణలో చైనా కొంతమేర విజయం సాధించిందని పేర్కొంది సీఎన్హెచ్సీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కరోనాను మహమ్మారిగా ప్రకటించిన ఒక్కరోజు వ్యవధిలోనే సీఎన్హెచ్సీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: వుహాన్‌లో 75 వేల మందికి సోకిన కరోనా వైరస్!