చైనాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్-19 రెండో దశలో కొత్తగా 51 కేసులు నమోదయ్యాయి. వీటిలో 40 వరకు రోగ లక్షణాలు లేని కేసులు. కరోనా వైరస్ పుట్టిందని భావిస్తున్న వుహాన్లోనే అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్హెచ్సీ) తెలిపింది. వుహాన్లో గత 10 రోజుల్లో 60 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది.
ఎన్హెచ్సీ ప్రకారం... విదేశాల నుంచి చైనాకు వచ్చిన స్వదేశీయుల్లో 11 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు.
వుహాన్లో మళ్లీ విజృంభణ
కొత్తగా గుర్తించిన 40 ఎసింప్టొమాటిక్ కేసుల్లో 38 వుహాన్లోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అప్రమత్తమైన ఆరోగ్యశాఖ చాలా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే 11.2 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు జరిపింది.
చైనాలో 396 ఎసింప్టొమాటిక్ కేసులుంటే.. వాటిలో 326 వుహాన్లో నమోదు కావడం గమనార్హం.