గతేడాది చివరలో చైనాలోని వుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. చైనాలో శనివారం ఒక్కరోజే 47 మంది మరణించగా.. ఇప్పటివరకు వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 2,835కు చేరింది. అంతే కాకుండా ఇక్కడ 427 కొత్త కేసులు నమోదు కాగా.. వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 79వేలకుపైగా దాటింది.
గతంతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్న కేసులు తక్కువేనని బీజింగ్ వైద్య అధికారులు వెల్లడించారు. అయితే చైనాలో కంటే ఇతర దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ప్రబలుతోందని వివరించారు. మరోవైపు హుబే రాష్ట్రంలో 56 మిలియన్ల మందిని వైద్య నిర్భంద కేంద్రంలో ఉంచారు. ప్రస్తుతం ఈ మహమ్మారిని అరికట్టే క్రమంలో తమ దేశం పురోగతిని సాధించిందని చైనా అధికారులు తెలిపారు.