చైనాలో మళ్లీ కరోనా విజృంభణ - corona global death toll
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. చైనాలో కొత్తగా 46మందికి వైరస్ సోకింది. గత నెలరోజుల్లో అక్కడ ఇవే అత్యధికం. సింగపూర్‌లోనూ మరో 481మంది వైరస్ బారినపడ్డారు. పాకిస్థాన్‌లో కరోనా మృతుల సంఖ్య 5వేల 882కు చేరింది.
చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
By
Published : Jul 26, 2020, 7:05 PM IST
కరోనా వైరస్‌కు కేంద్రబిందువైన చైనాలో కొత్త కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత నెల రోజుల్లో ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లో 46మంది వైరస్ బారినపడినట్లు అధికారులు తెలిపారు. చైనాలో ఇప్పటివరకు 83వేల 830మందికి వైరస్ సోకింది. మొత్తం 4వేల 634మంది ప్రాణాలు కోల్పోయారు.
సింగపూర్‌లో 481..
సింగపూర్‌లో కొత్తగా 481 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా విదేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. మొత్తం బాధితుల సంఖ్య 50వేల 369కి చేరింది.
సింగపూర్‌లో ఈ వారం నుంచే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని స్థానిక మీడియా తెలిపింది. 108 మంది ఆరోగ్య కార్యకర్తలపై వ్యాక్సిన్‌ను ప్రయోగించనున్నారు.
పాకిస్థాన్‌లో...
పాకిస్థాన్‌లో కొత్తగా నమోదైన 1226 పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 73వేల 112కు చేరింది. 24 గంటల్లో 35మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 5వేల 882కు పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 62లక్షల 37వేల 961మందికి కరోనా సోకింది. 6 లక్షల 49వేల 186మంది వైరస్‌కు బలయ్యారు. 99లక్షల 37వేల 813మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.