తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్​: చైనాలో తగ్గినా దక్షిణ కొరియాలో విజృంభణ - చైనాలో మళ్లీ పెరిగిన కరోనా మరణాలు

చైనాలో కరోనా మహమ్మారి కాస్త శాంతించింది. అయితే వైరస్​ బారిన పడి గురువారం మరణించిన వారి సంఖ్య 44గా నమోదైంది. అది బుధవారం 29 మాత్రమే. కానీ కొత్త కేసుల విషయంలో గత నెలరోజుల్లో కనిష్ఠ సంఖ్య నమోదైంది. దక్షిణ కొరియాలో మాత్రం ఈ వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. నైజీరియాలో తొలి కేసు నమోదైంది.

Coronavirus
చైనాలో మళ్లీ పెరిగిన కరోనా మరణాలు

By

Published : Feb 28, 2020, 10:02 AM IST

Updated : Mar 2, 2020, 8:14 PM IST

కరోనా ఎఫెక్ట్​: చైనాలో తగ్గినా దక్షిణ కొరియాలో విజృంభణ

చైనాలో కరోనా కాస్త నెమ్మదించింది. కొత్త కేసుల సంఖ్య గత నెలరోజుల్లోనే అత్యల్పంగా నమోదైంది. అయితే మరణాల సంఖ్య మాత్రం కలవరపెడుతోంది. మొన్న మృతుల సంఖ్య 29 ఉండగా.. నిన్న 44కు పెరిగింది. ఇప్పటివరకూ వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 2,788కి చేరింది. కొత్తగా 327 కేసులు నమోదైనట్లు చైనా హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది.

చైనావ్యాప్తంగా 78,824 మంది వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్నారు. నియంత్రణ చర్యల్లో భాగంగా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన తమ పౌరులను 14 రోజులపాటు విడిగా ఉంచుతోంది. పరీక్షలు ప్రతికూలమని తేలిన తర్వాతనే స్వస్థలాలకు పంపుతోంది.

కొరియాలో వేగంగా..

దక్షిణ కొరియాలో వైరస్‌ రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న మరో 256 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 2,022 మందికి వైరస్‌ సోకినట్లు అధికారవర్గాలు తెలిపాయి. వైరస్‌ కేసుల్లో 90 శాతం డెగూ నగరం, ఉత్తర జియోంగ్‌సంగ్‌ ప్రావిన్స్‌లోనే నమోదవుతున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటివరకూ దక్షిణ కొరియాలో కరోనా వైరస్‌ బారిన పడి 13 మంది మృతి చెందారు.

నైజీరియాలో తొలికేసు..

ఆఫ్రికాలోని నైజీరియాలో తొలి కేసు నమోదైంది. ఇటలీలోని మిలాన్​ నుంచి లాగోస్​కు వచ్చిన ఇటలీ దేశస్థుడికి ఈ వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయిందని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వ్యాధి బారిన పడిన వ్యక్తి పరిస్థితి స్థిమితంగానే ఉందని.. ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నట్లు పేర్కొంది. నైజీరియా కన్నా ముందు ఆఫ్రికాలోని ఈజిప్ట్​, అల్గేరియాలో రెండు కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: కరోనా: చైనా కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువ కేసులు!

Last Updated : Mar 2, 2020, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details