కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న చైనాను ఎసింప్టొమాటిక్ కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా.. ఎలాంటి వైరస్ లక్షణాలు లేకుండా 28 కేసులు నమోదయ్యాయి. వీటిలో చాలా కేసులు వైరస్‌కు కేంద్రబిందువైన హుబే రాష్ట్ర రాజధాని వుహాన్‌కు చెందినవేనని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది.
కరోనా 2.0: చైనాలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు - కరోనా వైరస్ చైనా
చైనాలో కరోనా వైరస్ రెండో దశ విజృంభిస్తోంది. ఎలాంటి లక్షణాలు బయటపడని కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా 28 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 25 కేసులు హుబే రాష్ట్రానికి చెందినవేనని చైనా తెలిపింది.
చైనాలో ఎసింప్టొమాటిక్ కేసుల కలవరం.. తాజాగా మరో 28
ఇప్పటివరకు మొత్తం 370 ఎసింప్టొమాటిక్ కేసుల బాధితులు క్వారంటైన్లో ఉన్నట్టు చైనా తెలిపింది. వీరిలో 26మంది విదేశీయులున్నారు. తాజాగా నమోదైన 28 కేసుల్లో.. హుబే రాష్ట్రం నుంచే 25 కేసులున్నాయి. ప్రస్తుతం హుబేవ్యాప్తంగా 295మంది వైద్యుల పరిశీలనలో ఉన్నారు.
శుక్రవారం నాటికి చైనాలో వైరస్ బాధితుల సంఖ్య 82,971కి చేరింది. 4వేల 634మంది ప్రాణాలు కోల్పోయారు.