చైనాలో కరోనా రెండో సారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులగా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. కొత్తగా 23 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇందులో 17 కేసులు లక్షణాలు లేకుండా బయటపడ్డవే. దీంతో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందంటున్నారు వైద్యులు.
చైనా జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్క రోజులోనే లక్షణాలు కనిపించకుండా వుహాన్లో ఒకటి, జిలిన్ రాష్ట్రంలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో వుహాన్లో ఇప్పటి వరకు లక్షణాలు లేని పాజిటివ్ కేసుల సంఖ్య 285కు చేరింది.