చైనాలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా ఆదివారం 22 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు చెప్పాయి. మృతుల్లో ఒకరు మినహా మిగిలిన వారంతా హుబే ప్రాంతానికి చెందిన వారని సమాచారం. జనవరి నుంచి ఇప్పటివరకు ఆదివారమే తక్కువ మరణాలు సంభవించాయి.
కరోనా మహమ్మారితో మరో 22 మంది మృతి - చైనాలో కరోనా వైరస్ తగ్గుముఖం
చైనాలో ప్రాణాంతక మహమ్మారి కరోనా ధాటికి ఆదివారం 22 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. మరో 40 మందికి వైరస్ సోకినట్లు వెల్లడించారు. కొత్తగా పెరిగిన బాధితులతో ఇప్పటి వరకు 80,700 మందికిపైగా కేసులు నమోదైనట్లు స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారితో మరో 22 మంది మృతి
ఈ నేపథ్యంలో ఆదివారం మరణించిన 22మందితో మృతుల సంఖ్య 3,119కు చేరిందని తెలిపారు అధికారులు. మరో 40 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 80,700లకు పైగా కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:అడవిని చదివిన 'తులసి' బామ్మకు పద్మశ్రీ
Last Updated : Mar 9, 2020, 12:12 PM IST