తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్: కీలక అధికారులపై ప్రభుత్వం వేటు - కరోనా వుహాన్

అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా వైరస్​ను అరికట్టడంలో విఫలమైనందుకు అధికారులపై చైనా ప్రభుత్వం వేటు వేసింది. హుబె రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ వైద్యాధికారులను విధుల నుంచి తొలగించినట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. వీరితోపాటు మరికొంత మంది అధికారులను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

China removes two Hubei leaders as virus crisis deepens
కరోనా ఎఫెక్ట్: కీలక అధికారులపై ప్రభుత్వం వేటు

By

Published : Feb 11, 2020, 12:26 PM IST

Updated : Feb 29, 2020, 11:27 PM IST

చైనాలో కరోనా వైరస్ నియంత్రించడంలో విఫలమైనందుకు అధికారులపై వేటు వేసింది అక్కడి ప్రభుత్వం. హుబె రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ వైద్యాధికారులను విధుల నుంచి తప్పించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కమ్యూనిస్ట్​ పార్టీకి చెందిన హుబె రాష్ట్ర​ ఆరోగ్య కమిషన్ సారథి ఝాంగ్ జిన్, డైరెక్టర్​ లియు యింగ్జిలను వారి హోదాల నుంచి ప్రభుత్వం తొలగించినట్లు మీడియా పేర్కొంది.

హుబె రాష్ట్రానికి చెందిన పార్టీ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనాలోని ప్రముఖ వార్తా ఛానెల్ సీసీటీవీ తెలిపింది. వారి స్థానంలో జాతీయ వైద్య కమిషన్ అధ్యక్షుడు వాంగ్ హెషెంగ్​ బాధ్యతలను చేపట్టనున్నట్లు వెల్లడించింది. వైరస్ నియంత్రణ చర్యలను సమీక్షించేందుకు బీజింగ్ సీనియర్ అధికారి చెన్ యిక్సిన్​ను వుహాన్​కు పంపినట్లు వివరించింది. పార్టీ హుబె విభాగం మాజీ డిప్యూటీ చీఫ్​ అయిన చెన్ యిక్సిన్​ను.. వుహాన్​కు పంపిన కేంద్ర ప్రభుత్వ బృందానికి అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపింది.

మరిన్ని బదిలీలు!

వీరితో పాటు మరికొంత మంది అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్​ క్రాస్ సంస్థ అత్యున్నత అధికారిని విధుల్లో నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది.

కరోనా వైరస్ కారణంగా హుబె రాష్ట్రం​లో మరణాలు వందల సంఖ్యలో నమోదవుతున్న కారణంగా స్థానిక అధికారులపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కరోనాను తొలుత గుర్తించిన వైద్యుడి మరణం తర్వాత ఈ ఒత్తిళ్లు మరింత ఎక్కువయ్యాయి.

ఇదీ చదవండి: భారత వ్యోమగాములకు అంతరిక్ష శిక్షణ షురూ

Last Updated : Feb 29, 2020, 11:27 PM IST

ABOUT THE AUTHOR

...view details