కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో కేసుల సంఖ్య తగ్గిపోయింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల ద్వారా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయని అధికారులు అప్రమత్తమయ్యారు. జూన్‌లో కరోనా కేసులు మళ్లీ నమోదవ్వడానికి బీజింగ్‌లోని అతిపెద్ద మాంసం విక్రయ మార్కెటే కారణమని తెలిసిన తర్వాత అధికారుల్లో ఆందోళన ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార పదార్థాలను ఇటీవలే పరీక్షించారు.
ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకుంటున్న రొయ్యల పార్సిల్ ప్యాకేజీలో వైరస్ ఉన్నట్లు పరీక్షల అనంతరం నిర్ధరించారు చైనా కస్టమ్స్ అధికారులు. ఆ దేశం నుంచి ఆహార పదార్థాల దిగమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.