చైనా రాజధాని బీజింగ్‌లో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. జిలిన్ రాష్ట్రంలో 46, రష్యా సరిహద్దు రాష్ట్రం హిలాన్ జియింగ్లో 46 మందికి వైరస్ సోకింది. బీజింగ్‌కు పక్కనున్న హెబే రాష్ట్రంలో 19 కేసులు వెలుగు చుశాయి. దాంతో వైరస్ వ్యాప్తి మొదలయినప్పటి నుంచి చైనాలోని కరోనా కేసుల సంఖ్య 88,557 కు చేరింది.
చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొద్దిరోజులలో లూనార్ నూతన సంవత్సరం వస్తుండగా వైరస్ కేసులు పెరగడం ఆ దేశ ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది.
చైనా మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
మరోవైపు... ఫిబ్రవరిలో 5కోట్ల మందికి కరోనా టీకాలను వేయాలని చైనా సంకల్పించింది. అంతేకాకుండా పాఠశాలలను తెరవాలని నిర్ణయించింది. కొద్ది రోజులలో వచ్చే లూనార్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకూడదని ఆదేశించింది.
ఇదీ చూడండి:'కరోనా పట్ల చైనా, డబ్ల్యూహెచ్ఓ అలసత్వం'
Last Updated : Jan 20, 2021, 11:31 PM IST