చైనాలో విద్యుత్ సంక్షోభం (China power crisis) తలెత్తింది. కొన్ని రాష్ట్రాలు రోజుకు 9 గంటలకుపైగా విద్యుత్ కోతలను అమలు చేస్తున్నాయి. షెన్యాంగ్‌లో వినియోగదారులు రెస్టారెంట్లలో సెల్‌ఫోన్ వెలుగులోనే ఆహార పదార్థాలను తినాల్సి వస్తోంది. సూపర్ మార్కెట్లు కూడా విద్యుత్ కోతల (China power crunch) కారణంగా జనరేటర్లతో నడుస్తున్నాయి.
చైనాలో విద్యుత్ కొరతకు (China power cuts) చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొవిడ్ ఆంక్షల అనంతరం ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్యం పుంజుకోగా.. చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది. విద్యుత్తుకు ఒక్కసారిగా గిరాకీ పుంజుకుంది. 2020తో పోలిస్తే 2021లో విద్యుత్తు వినియోగం 13 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిమాండ్‌కు తగిన స్థాయిలో ఉత్పత్తి (China restrict electricity) లేకపోవడం వల్ల కోతలు తప్పడం లేదు. (China power shortage 2021)
చైనాలో ఎక్కువ శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారంగానే జరుగుతోంది. 2060 నాటికి కర్బన రహిత దేశంగా మారాలన్న లక్ష్యంతో షీ జిన్‌పింగ్ సర్కారు అనేక నిబంధనలను రూపొందించింది. వీటివల్ల బొగ్గు కొరత తలెత్తి సమస్యను మరింత తీవ్రం చేసింది. వివిధ రాష్ట్రాలు కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం విద్యుదుత్పత్తిపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇది కూడా విద్యుత్తు కోతలకు దారి తీస్తోంది.