China planes in Taiwan:తైవాన్‌పై చైనా దుందుడుకు వైఖరి కొనసాగిస్తోంది. ఆ దేశంపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా గగనతలంలోకి మరోసారి యుద్ధవిమానాలను పంపించింది. మొత్తం 13 సైనిక విమానాలు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి శుక్రవారం ప్రవేశించాయి.
ఆఫ్రికా దేశమైన నికరాగువా తైవాన్‌తో దౌత్య సంబంధాలు తెంచుకున్న రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఇదే రోజు చైనాతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంది నికరాగువా.
Taiwan China conflict
తైవాన్ గగనతలంలోకి ప్రవేశించిన విమానాల్లో రెండు హెచ్6 బాంబర్లు, ఓ వై8 ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానం ఉన్నట్లు తెలుస్తోంది. వై8 యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ విమానంతో పాటు, ఆరు షెన్యాంగ్ జే16, రెండు చెంగ్డూ జే10 ఫైటర్ జెట్ విమానాలు ఉన్నాయని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది.
Taiwan China relations
చైనాకు దీటుగా తైవాన్ వాయుసేన సైతం యుద్ధ విమానాలను గగనతలంలోకి పంపించిందని రక్షణ శాఖ వెల్లడించింది. చైనా విమానాలను హెచ్చరించేలా రేడియో సంకేతాలు పంపినట్లు తెలిపింది. ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థను సైతం రంగంలోకి దించినట్లు వివరించింది.
China Taiwan aggression
తైవాన్ను ఆక్రమించుకోవాలన్న లక్ష్యంతో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఏడాది కాలంగా తైవాన్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో 150కి పైగా యుద్ధ విమానాలను ఆ దేశం మీదకు పంపించింది. తైవాన్ను పూర్తిగా తమలో కలుపుకుంటామని, అవసరమైతే సైనిక చర్యకు వెనకాడబోయేది లేదని చెబుతోంది.
1949 సివిల్ వార్ సమయంలో తైవాన్, చైనా విడిపోయాయి. అప్పటి నుంచి తైవాన్ స్వయం ప్రతిపత్తిని గుర్తించేందుకు డ్రాగన్ విముఖత వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ వేదికల్లో తైవాన్ భాగస్వామ్యం కావడాన్నీ వ్యతిరేకిస్తోంది.
ఇదీ చదవండి: