తమ దేశంలో అశ్లీలత, ఇతర తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు చైనా కీలక నిర్ణయం తీసుకుంది. తన భాగస్వామి ట్రిప్అడ్వైజర్ సహా 105 మొబైల్ యాప్‌లను యాప్‌స్టోర్ నుంచి తొలగించాలని జాతీయ సైబర్‌స్పేస్ ఉత్తర్వులు జారీ చేసింది. అశ్లీలత, పోర్నోగ్రఫీ, హింసాత్మక సమాచారం, మోసాలు, వ్యభిచారం వంటివాటిపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
105 మొబైల్ యాప్‌లపై చైనా నిషేధం - China news
చైనా ప్రభుత్వం 105 యాప్‌లను నిషేధించింది. వాటిని ఈ వారంలోనే యాప్ స్టోర్ నుంచి తొలగించాలని జాతీయ సైబర్‌స్పేస్ ఉత్తర్వులు జారీ చేసింది. అశ్లీలత, ఇతర తప్పుడు సమాచారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

105 మొబైల్ యాప్‌లపై చైనా కన్నెర్ర
అయితే ట్రిప్అడ్వైజర్ చైనా, ట్రిప్ అడ్వైజర్‌కు జాయింట్ వెంచర్ అయిన ట్రిప్.కామ్ ఇంకా ఈ నిషేధంపై స్పందించలేదు.
ఇదీ చూడండి:'చైనా టీకా 86% సమర్థవంతం'