అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. హ్యూస్టన్లోని చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించిన నేపథ్యంలో.. చైనా ప్రతికార చర్యలకు సిద్ధమైంది. చెంగ్డు నగరంలోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించింది.
గూఢచర్య ఆరోపణలతో హ్యూస్టన్లోని చైనా దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలని రెండురోజుల క్రితమే ఆదేశించింది అమెరికా. మరిన్ని రాయబార కార్యాలయాల మూసివేత దిశగా సంకేతాలిచ్చింది. చైనాకు చెందిన ఇంకొన్ని దౌత్య కార్యాలయాలను మూసివేసే అవకాశాలను తోసిపుచ్చలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించటం ఇందుకు బలం చేకూర్చుతోంది.