సరిహద్దులోని సైనికుల సౌకర్యార్థం 5జీ సిగ్నల్ బేస్‌ను చైనా ప్రారంభించింది. టిబెట్ హిమాలయ కొండ ప్రాంతాల్లోని గన్బాలా రాడార్ స్టేషన్ వద్ద దీనిని ఏర్పాటు చేసింది. ఈ రాడార్ స్టేషన్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో(5,374 మీటర్లు) ఉండటం గమనార్హం. టిబెట్‌లోని నాగార్జే కౌంటీలో ఈ 5జీ సిగ్నల్ బేస్ ఉంది. ఇది భారత్, భూటాన్ సరిహద్దుకు సమీపంలోని ప్రాంతం.
సైన్యం కోసం చైనా 5జీ సిగ్నల్ సదుపాయం - చైనా సైన్యం కోసం 5జీ
సరిహద్దుల్లో విధుల్లో నిర్వర్తించే సైన్యంతో సమాచార వ్యవస్థను పటిష్ఠం చేసుకునేందుకు 5జీ సిగ్నల్ కేంద్రాన్ని చైనా ప్రారంభించింది. ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో ఉన్న టిబెట్‌లోని రాడార్ స్టేషన్ వద్ద దీన్ని ఏర్పాటు చేసింది.
![సైన్యం కోసం చైనా 5జీ సిగ్నల్ సదుపాయం china 5g signal base for soldiers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11378333-thumbnail-3x2-111.jpg)
సరిహద్దులో భద్రతా బలగాలకు నెట్వర్క్ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో.. ఈ 5జీ బేస్ స్టేషన్ నిర్మాణ పనులను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గతేడాది చేపట్టింది. దీని ద్వారా ద్వారా కొండ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ పదిలంగా ఉంటుందని సదరు వెబ్సైట్ పేర్కొంది. అంతేకాకుండా.. సరిహద్దులో ఉండే సైనికులకు నిస్సార జీవితం నుంచి విముక్తి కల్పించేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. భద్రతా దళాల విధినిర్వహణ పరిస్థితులను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగమే ఈ ఏర్పాటు అని చెప్పింది.
ఇదీ చూడండి:అణు కర్మాగారంపై దాడి ఇజ్రాయెల్ పనే: ఇరాన్