తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచంలోనే హైస్పీడ్​ రైలు- చైనా ఘనత - చైనా హైస్పీడ్ రైలు

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైలును రూపొందించింది చైనా. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొంది.

high speed maglev train
చైనా మాగ్లెవ్ రైలు

By

Published : Jul 20, 2021, 10:09 PM IST

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైలును చైనా రూపొందించింది. ఇది గంటకు 600 కిలోమీటర్ల వేగంతో అయస్కాంత శక్తితో ప్రయాణిస్తుందని చైనా తెలిపింది. ఈ రైలు చైనా తూర్పు షాన్డాంగ్ ప్రావిన్స్.. తీరప్రాంత నగరమైన కింగ్డావో రవాణా వ్యవస్థల ప్రయాణికులకు సేవలను అందించనున్నట్లు వెల్లడిచేసింది.

2016 అక్టోబర్‌లో ఈ హై-స్పీడ్ మాగ్లెవ్ రైల్ ప్రాజెక్ట్ ప్రారంభమై.. 2019 లో పూర్తి అయినట్లు వివరించింది. 2020 జూన్‌లో టెస్ట్ రన్ నిర్వహించగా విజయవంతమైనట్లు పేర్కొంది. ఈ రైలు రెండు నుంచి 10 బోగీలతో ప్రయాణిస్తుందని ఒక్కొ బోగిలో 100 మందికి పైగా ప్రయాణం చేసేలా రూపోందించినట్లు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ డింగ్ సన్సాన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details