China Oldest Person: చైనాలో అతిపెద్ద వయస్కురాలు.. శతాధిక వృద్ధురాలు అలీమిహాన్ సెయితీ కన్నుమూశారు. జిన్‌జియాంగ్ ప్రాంతంలో 135 ఏళ్ల వయసులో ఆమె మరణించినట్లు స్థానిక మీడియా శనివారం తెలిపింది. సెయితీ 1886,జూన్ 25న జన్మించారు. 2013లో చైనా అసోసియేషన్ ఆఫ్ జెరోంటాలజీ అండ్ జెరియాట్రిక్స్ జారీ చేసిన చైనా అత్యంత వృద్ధుల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు.
మరణించేంత వరకు ఆమె ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సరళమైన జీవితాన్ని గడిపారు. సమయానికి తింటూ తన పెరట్లో ఎండలో నడుస్తూ ఆనందించేవారని స్థానిక మీడియా పేర్కొంది. తుదిశ్వాస వరకు తన మునిమనవళ్ల పరిరక్షణలోనే ఉందని వెల్లడించింది.