తెలంగాణ

telangana

ETV Bharat / international

భూటాన్​ భూభాగంలో చైనా హల్​చల్​

సరిహద్దులో చైనా హల్​చల్​ కొనసాగిస్తూ.. భూటాన్​ భూభాగంలో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించుకుంది. చైనాకు చెందిన ఓ జర్నలిస్ట్​ పెట్టిన దృశ్యాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

CHINA OCCUPIES BHUTAN LAND AND BUILT A VILLAGE BOARDER
భూటాన్​ భూభాగంలో చైనా హల్​చల్​

By

Published : Nov 20, 2020, 6:48 AM IST

చైనా విస్తరణ కాంక్షకు అడ్డూఆపూ ఉండటం లేదు. భూటాన్​లోకి 2 కిలోమీటర్ల మేర డ్రాగన్ చొచ్చుకెళ్లినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా.. అక్కడ ఓ గ్రామాన్ని కూడా నిర్మించినట్టు వెల్లడైంది.

2017లో భారత్​, చైనా సైన్యాల మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడిన ప్రాంతానికి ఇది 9 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. ఈ గ్రామాన్ని పంగ్డా అని పిలుస్తున్నారు. చైనా అధికార మీడియాకు చెందిన ఓ సీనియర్​ పాత్రికేయుడు పెట్టిన చిత్రాలు, ట్వీట్​లతో ఈ విషయం బహిర్గతమైంది. అనంతరం వాటిని తొలగించారు.

ఆందోళనలో భారత్​..

చిన్న చిన్న భాగాలుగా భారత్​, భూటాన్​ భాగాలను ఆక్రమించేందుకు చైనా వ్యూహరచన చేస్తోందన్న అనుమానాలను ఇది ధ్రువపరుస్తోంది. తాజా పరిణామం భారత్​కు మరింత ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే.. భూటాన్​ రక్షణ బాధ్యతలను మనదేశమే నిర్వహిస్తోంది.

ఇదీ చదవండి:భూటాన్​లో 'రూపే' సేవలను ప్రారంభించనున్న మోదీ

ABOUT THE AUTHOR

...view details