భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అరుణాచల్‌ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్... దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా ఎప్పటి నుంచో వింత వాదన చేస్తోంది.
చైనా సరిహద్దులో పౌర-సైనిక స్నేహాన్ని పెంపొందించే 'మైత్రీ దివస్' వేడుకల కోసం రాజ్‌నాథ్‌సింగ్ గురువారం తవాంగ్‌ను సందర్శించారు. దీనిని చైనా వ్యతిరేకించింది.
చైనా ప్రయోజనాల దృష్ట్యా
"అరుణాచల్‌ప్రదేశ్‌ను భారత భూభాగంగా చైనా ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదు. భారత అధికారులు, నాయకులు ఆ ప్రాంతంలో పర్యటించడాన్ని, వివిధ కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం."- జెంగ్ షువాంగ్, చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి