అమెరికా వైదొలిగిన అనంతరం అఫ్గాన్‌పై పట్టుసాధించేందుకు చైనా(china taliban support) విశ్వప్రయత్నాలు చేస్తోంది. అక్కడి ఖనిజాలపై కన్నేసిన చైనా.. తాలిబన్లతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటోంది. తాజాగా.. చైనా- తాలిబన్ల మైత్రికి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. త్వరలో తాలిబన్లు ప్రభుత్వాన్ని(taliban news today) ఏర్పాటు చేయనుండగా.. ఆ వేడుకలో పాల్గొనాల్సిందిగా చైనాకు ఆహ్వానం లభించిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని చైనా ఖండించకపోవడం వల్ల ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది.
చైనాతో పాటు పాకిస్థాన్, టర్కీ, రష్యా, ఇరాన్, ఖతార్‌కు ఆహ్వానం అందినట్టు సమాచారం. ఇదే విషయాన్ని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెంబిన్ను మీడియా సభ్యులు అడగ్గా.. తన వద్ద సమాచారం లేదని ఆయన దాట వేసే ప్రయత్నం చేశారు.
"పొరుగు దేశాలతో సఖ్యతగా ఉండే, విదేశాంగ విధానాలను గౌరవించే సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటులో అఫ్గానిస్థాన్‌కు చైనా కచ్చితంగా మద్దతిస్తుంది. అయితే తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు వేడుకకు చైనాకు ఆహ్వానం లభించిందా? అన్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు."
-- వాంగ్ వెంబిన్, చైనా విదేశాంగశాఖ ప్రతినిధి.
రెండు దశాబ్దాల పాటు అఫ్గాన్‌కు పెద్దన్నగా వ్యవహరించి.. ఉగ్రవాదంపై సుదీర్ఘ పోరాటం చేసింది అమెరికా. కానీ ఒక్కసారిగా తమ బలగాలను పూర్తిస్థాయిలో ఉపసంహరించుకుని(america evacuation).. అఫ్గాన్ సంక్షోభానికి తెరతీసింది. అమెరికా వెనుదిరగడాన్ని అవకాశంగా చూసిన చైనా.. ఇప్పుడు అఫ్గాన్‌పై పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధపడుతోంది(china afghanistan). అగ్రరాజ్యం వైదొలిగిన అనంతరం ఏర్పడిన ఖాళీని చైనా భర్తీ చేయాలని యోచిస్తోంది. మధ్య ఆసియాలో ఆధిపత్యం చలాయించాలనే తన కలను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది.
అమెరికా బలగాలు వెళ్లిపోయిన తర్వాత తాలిబన్ సేనలు కాబుల్ విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఆ తర్వత మొదటగా తాలిబన్లకు అనుకూలంగా ప్రకటన చేసింది చైనానే. తాలిబన్లతో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అది జరిగిన కొద్ది రోజులకే చైనా తాలిబన్లతో బహిరంగ చర్చలు మొదలుపెట్టింది. కాబుల్‌లో తన రాయబార కార్యాలయాన్ని ఇందుకు ఉపయోగించుకుంది. తాలిబన్లకు మద్దతుగా అనేక ప్రకటనలు చేసింది. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో పాశ్చాత్య దేశాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కానీ తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో చైనా, దాని మిత్ర దేశం పాకిస్థాన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాయి!
అటు తాలిబన్లు కూడా చైనాతో మైత్రికోసం ఉవ్విళ్లూరుతున్నారు. చైనా తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా(taliban china connection) పేర్కొన్నారు. అఫ్గాన్(Afghan Taliban) పునర్నిర్మాణం కోసం, ఆర్థికంగా చితికిపోయి, ఆకలి కేకల్లో చిక్కుకున్న దేశాన్ని బయటపడేసేందుకు చైనా వైపు చూస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:-Afghan news: అఫ్గాన్ సంపదపై డ్రాగన్ కన్ను.. తాలిబన్లతో మంతనాలు!