తెలంగాణ

telangana

By

Published : Dec 31, 2019, 7:43 AM IST

ETV Bharat / international

చైనా సైన్యం చేతిలో అధునాతన రక్షణ వ్యవస్థ!

పొరుగుదేశం చైనా చేతిలో రెండు అధునాతన విమాన వాహక నౌకలు ఉన్నాయని ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. రెండు క్షిపణి విధ్వంసక నౌకలను నావికాదళంలో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. ఇవి డ్రాగన్​ సైన్యానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంది.

china
చైనా సైన్యం చేతిలో అధునాతన రక్షణ వ్యవస్థ!

చైనా రెండు అధునాతన విమాన వాహక నౌకలను వినియోగంలోకి తెచ్చింది. ఈ విషయంపై డ్రాగన్ దేశ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. వీటిని నిలిపేందుకు వీలుగా హిందూ మహా సముద్రంలోని జిబౌటీలోని నౌకాశ్రయంలో ఏర్పాట్లు చేసిందని వెల్లడించింది.

చైనా సైన్యం 'పంట' పండింది...

ఈ ఏడాది చైనా సైనిక దళాల పంట పండింది. నెలవారీ చొప్పున నావికాదళంలో నూతన ఓడలను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే గత శుక్రవారం.. ఆరో శ్రేణికి చెందిన 055, 23వ శ్రేణికి చెందిన 052జీ అనే క్షిపణి విధ్వంసక నౌకలను ప్రవేశపెట్టిందని మీడియా వెల్లడించింది. ఈ అధునాతన నౌకలు మరో రెండేళ్లలో పూర్తిస్థాయి కార్యకలాపాలు చేపట్టనున్నాయని సమాచారం.

2013లో సైనిక విధానాన్ని సమీక్షించిన నాటి నుంచి పదాతి దళాన్ని మూడు లక్షలకు తగ్గించుకున్న చైనా.. ప్రపంచ గమనాన్ని దృష్టిలో ఉంచుకుని నావికాదళాన్ని విస్తరించింది. అయితే విమాన వాహక నౌకల రంగంలోకి ఆలస్యంగా ప్రవేశించిన డ్రాగన్ దేశం.. ఈ శ్రేణిలో రెండో నౌక అయిన షాంగ్​డాంగ్​ను డిసెంబర్ 17న వినియోగంలోకి తెచ్చింది. 2012లో ప్రవేశపెట్టిన లియోనింగ్​తో పోల్చితే ఇది చాలా పెద్దది. 40-60 వేల టన్నుల మధ్య మోయగలిగిన సామర్థ్యం షాంగ్​డాంగ్ సొంత. దీనిపై 36 విమానాలు సహా పలు హెలికాఫ్టర్లను నిలిపేందుకు అవకాశం ఉంది.

రాబోయే రోజుల్లో ఐదు నుంచి ఆరు విమాన వాహక నౌకలను సమకూర్చుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: 148 రోజులుగా నిర్బంధంలో ఉన్న కశ్మీరీ నేతలు విడుదల

ABOUT THE AUTHOR

...view details