తెలంగాణ

telangana

ETV Bharat / international

బలగాల ఉపసంహరణకు చైనా సాకులు! - చైనా వర్సెస్​ భారత్​

పాంగాంగ్​ సరస్సు వద్ద నుంచి బలగాలను ఉపసంహరించుకున్న చైనా.. తూర్పు లద్దాఖ్​లోని మిగతా ప్రాంతాల్లో బలగాలు ఉపసంహరణకు సాకులు చెబుతోంది. డబ్ల్యూఎంసీసీ సమావేశాల కోసం భారత్‌ ఎదురుచూస్తోంటే చైనా మాత్రం ఆ అవసరం లేదంటోంది.

disengagement of china forces
తూర్పులద్దాఖ్​లో చైనా బలగాల ఉపసంహరణ

By

Published : Jun 6, 2021, 10:27 PM IST

తూర్పు లద్దాఖ్​లోని మిగతా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు చైనా సాకులు చెబుతోంది. ఇరుదేశాల సైనిక కమాండర్ల మధ్య పలు విడతల చర్చల తర్వాత పాంగాంగ్‌ సరస్సు వద్ద నుంచి బలగాలు ఉపసంహరించుకున్న డ్రాగన్‌... గోగ్రా, హాట్‌ స్ప్రింగ్‌ ప్రాంతాల్లో ఉద్రిక్తతల నివారణ అంశాన్ని స్థానిక సైనిక కమాండర్లు పరిష్కరించుకోవాలని అంటోంది. ఇందుకోసం వర్కింగ్ మెకానిజమ్‌ ఫర్‌ కన్సల్టేషన్ అండ్‌ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమావేశం తేదీల కోసం భారత్‌ ఎదురుచూస్తోంటే డ్రాగన్‌ మాత్రం ఆ అవసరం లేదంటోంది.

మే 2020లో పాంగాంగ్‌, హాట్‌ స్ప్రింగ్‌ ప్రాంతాల్లో పీపుల్​ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్​ఏ) దురాక్రమణతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే తూర్పులద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతలు తగ్గాలని భారత్‌ స్పష్టం చేసింది. చైనా మాత్రం ఈ అంశాన్ని ద్వైపాక్షిక కోణంలో కాకుండా స్థానిక సమస్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details