తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో పెరుగుతున్న కేసులు.. లాక్​డౌన్​లోకి మరో పది ప్రాంతాలు - China locks down

China's capital re-institutes virus measures
చైనాలో పెరుగుతున్న కేసులు.. లాక్​డౌన్​లోకి మరో పది ప్రాంతాలు

By

Published : Jun 15, 2020, 9:17 AM IST

Updated : Jun 15, 2020, 10:28 AM IST

09:56 June 15

చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు

చైనాలో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 49 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని బీజింగ్​లోనే 36 కేసులు వెలుగు చూశాయి. విదేశాల నుంచి వచ్చిన వారు 10మంది కాగా హుబె ప్రావిన్సులో ముగ్గురికి వైరస్​ పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు. ​ఈ క్రమంలోనే బీజింగ్​ చుట్టుపక్కల మరో పది ప్రాంతాల్లో లాక్​డౌన్​ను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.  

చైనాలో కరోనా కేసులు పెరగడం వల్ల అప్రమత్తమైన అధికారులు సామూహికంగా కరోనా పరీక్షలు ప్రారంభించారు. మే 30 నుంచి చైనాలోని జిన్ఫాడి మాంసం మార్కెట్​ను సందర్శించిన 29,386 మందికి వైరస్​ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.  

177మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆ దేశ జాతీయ ఆరోగ్య అధికారులు తెలిపారు. 115మంది వైరస్ లక్షణాలు లేనివారు వైద్యుల పర్యవేక్షణలోనే నిర్బంధంలో ఉన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం వైరస్​తో 4,634 మంది మరణించగా... 83,181మంది వైరస్​ బారిన పడ్డారు.

09:09 June 15

చైనాలో పెరుగుతున్న కేసులు.. లాక్​డౌన్​లోకి మరో పది ప్రాంతాలు

చైనాలోని బీజింగ్​లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే బీజింగ్​లోని చాలా ప్రాంతాల్లో లాక్​డౌన్​ విధించింది చైనా సర్కార్​. తాజా బీజింగ్​ చుట్టుపక్కల మరో పది ప్రాంతాల్లో లాక్​డౌన్​ను ప్రకటించింది.

Last Updated : Jun 15, 2020, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details