తెలంగాణ

telangana

ETV Bharat / international

మిషన్ మార్స్​: శక్తిమంతమైన రాకెట్​ను ప్రయోగించిన చైనా - మిషన్ మార్స్​: శక్తిమంత రాకెట్​ను ప్రయోగించిన చైనా.

అంగారకుడిపై పరిశోధన కోసం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్​ను ప్రయోగించింది చైనా. 2022లో మానవులతో కూడిన అంతరిక్ష కేంద్రాన్ని మార్స్​పై ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

China launches powerful rocket in boost for 2020 Mars mission
మిషన్ మార్స్​: శక్తిమంత రాకెట్​ను ప్రయోగించిన చైనా

By

Published : Dec 27, 2019, 10:37 PM IST

Updated : Dec 27, 2019, 11:23 PM IST

అంతరిక్షంలో మరో కీలక ప్రయోగాన్ని చేపట్టింది చైనా. 2020లో అంగారకుడిపై పరిశోధనలు చేసేందుకు తొలి అడుగుగా ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన రాకెట్​ను నింగిలోకి పంపింది.

దక్షిణ ద్వీపమైన హైనన్లోని వెన్‌చాంగ్ ప్రాంతం నుంచి అతి పెద్ద 'లాంగ్ మార్చ్​ 5' రాకెట్​ను ఈరోజు రాత్రి 8.45 గంటలకు ప్రయోగించింది డ్రాగన్​ దేశం. అనంతరం 2 వేల సెకన్ల తర్వాత షిజియాన్​ 20 ఉపగ్రహన్ని నిర్ణీత కక్షలోకి పంపినట్లు అధికారులు తెలిపారు.

మానవులతో కూడిన అంతరిక్ష కేంద్రం...

2022లో అంగారకుడిపై మానవులతో కూడిన అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది డ్రాగన్​ దేశం. దీనికి సంబంధించిన కీలక అంశాలను తెలుసుకునేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

2017లో విఫలం...

చైనా 2017లో ఈ ప్రయోగాన్ని చేపట్టగా.. మధ్యలోనే విఫలమైంది.

ఇదీ చూడండి:ముస్లింలకు భరోసా ఇచ్చేందుకు ప్రత్యేక సదస్సు

Last Updated : Dec 27, 2019, 11:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details