తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా ఇచ్చిన ఆ యుద్ధనౌక ఎందుకంత ప్రత్యేకం? - చైనా పాక్

పాకిస్థాన్​-చైనా మధ్య రక్షణ సంబంధాలు శిఖర స్థాయికి చేరాయి. పాక్ కోసం అత్యాధునిక టైప్-054 యుద్ధనౌకలను తయారు చేస్తోంది చైనా. పొరుగు దేశం రక్షణ వ్యవస్థలో కీలకంగా మారనున్న ఈ యుద్ధనౌకలో ప్రత్యేకతలేమిటి? చైనా-పాక్​ల దృఢ బంధంతో భారత్​కు కొత్త సమస్యలు ఎదురవుతాయా?

China launches advanced warship for Pakistan Navy
పాకిస్థాన్ కోసం చైనా అత్యాధునిక యుద్ధనౌక

By

Published : Aug 25, 2020, 1:50 PM IST

శాశ్వత మిత్రదేశం పాకిస్థాన్​ కోసం అత్యాధునిక టైప్​-054 యుద్ధనౌకలను తయారు చేస్తోంది చైనా. మొదటి దానిని షాంఘైలోని హుడోంగ్​ ఝోంగ్వా నౌకాశ్రయంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించినట్లు పాకిస్థాన్​ మీడియా పేర్కొంది. దీంతో రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.

ఈ యుద్ధనౌకలో అత్యాధునిక ఉపరితల సాంకేతికతను ఉపయోగించి వాయు నిరోధక ఆయుధాలు, పోరాట నిర్వహణ వ్యవస్థలను రూపొందించినట్లు పాక్ మీడియా తెలిపింది.

రెండు టైప్​-054 యుద్దనౌకల తయారీ కోసం 2017లో చైనా షిప్​బిల్డింగ్​ ట్రేడింగ్​ కంపెనీ లిమిటెడ్​తో ఒప్పందం కుదుర్చుకుంది పాకిస్థాన్​. అయితే వీటి ఖరీదు, షరతులకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.

భారత్​తో సరిహద్దులో వివాదం నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్​కు సైనిక సాయం అందిస్తూ శక్తిమంతమైన ఆయుధాలు సమకూర్చుతోంది చైనా. ఫలితంగా భారత్​ను ఇబ్బందుల్లోకి నెట్టాలని భావిస్తోంది.

పాక్​కు చైనా ఇప్పటికే అణ్వాయుధ సహకారం, జేఎఫ్​-17 యుద్ధ విమానాలు, ఏ-100 రాకెట్ లాంచర్లు, రెండు దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అల్​ ఖలీద్​ ట్యాంకర్లు, హెచ్​క్యూ-16 క్షిపణులను సరఫరా చేస్తోంది. పొరుగు దేశంతో కలిసి భారత్​ను దెబ్బతీయాలని వ్యూహరచన చేస్తోంది.

ఇదీ చూడండి: చైనా వైరస్​ను అమెరికన్లు తరిమికొట్టాలి: ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details