తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా ఘనత.. 36గంటల్లో నింగిలోకి నాలుగు ఉపగ్రహాలు - నాలుగు శాటిలైట

కేవలం 36 గంటల వ్యవధిలోనే రెండు రాకెట్లను విజయవంతంగా నింగిలోకి పంపింది చైనా. మొదటగా లాంగ్​ మార్చ్​-11 అనే రాకెట్​ను ​జిచాంగ్​ శాటిలైట్​ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించింది. 36 గంటల వ్యవధిలో లాంగ్​ మార్చ్​-2డీ అనే మరో రాకెట్​ను అంతరిక్షంలోకి పంపించింది. ఈ రెండు రాకెట్లు నాలుగు విలువైన ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లాయి.

China launched four satellites in two days
36 గంటల్లో నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి పంపిన చైనా

By

Published : Jun 7, 2020, 5:44 PM IST

నాసా-స్పేస్​ఎక్స్​ ఘనతలను ప్రపంచం ప్రశంసిస్తున్న వేళ.. చైనా నిశ్శబ్దంగా అంతరిక్ష ప్రయాణాలు చేసేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల్లో విజయాలే లక్ష్యంగా దూసుకుపోతోంది. 36గంటల వ్యవధిలో రెండు రాకెట్లలో నాలుగు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. ఈ విషయాన్ని స్పేస్​ డాట్​ కామ్​ ప్రకటించింది. మే 30న నాసా డెమో-2ను అంతరిక్షంలోకి పంపిన సమయంలోనే చైనా రెండు రాకెట్లను పంపినట్లు వెల్లడించింది.

మొదటి ప్రయోగం...

బీజింగ్​ కాలమానం ప్రకారం మే 30 తెల్లవారుజామున 4:13 నిముషాలకు నూతన సాంకేతికతో కూడిన రెండు శాటిలైట్లను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది చైనా. వీటిని 'లాంగ్ మార్చ్​-11' అనే రాకెట్​ నింగిలోకి మోసుకెళ్లినట్టు ఆ దేశ మీడియా తెలిపింది.

'జిచాంగ్​ శాటిలైట్​ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్​ మార్చ్​-11 రాకెట్​ను ప్రయోగించటం ఇదే తొలిసారి. ఈ విజయంతో ఇతర రాకెట్లను నింగిలోకి ప్రయోగించటానికి వేదికగా ఈ కేంద్రం మారింద'ని లాంగ్​ మార్చ్​-11 రాకెట్​ చీఫ్​​ డిజైనర్ పెంగ్ కున్యా​ అన్నారు.

రెండో ప్రయోగం...

మరో 36 గంటల్లోనే వాయువ్య చైనా ప్రాంతం నుంచి మరో రెండు ఉపగ్రహాలను ప్రయోగించింది. మే 31న బీజింగ్ కాలమానం ప్రకారం సాయంత్రం 4:53 నిముషాలకు 'లాంగ్​ మార్చి-2డీ' అనే పేరుతో మరో రాకెట్​ను జియుక్వాన్ శాటిలైట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి పంపించింది చైనా.

చైనా పంపిన ఉపగ్రహాల్లో ఒక దాని పేరు 'గాఫెన్​-9' అని ఆ దేశ మీడియా తెలిపింది. ఈ మానవ నియంతృత శాటిలైట్​ ద్వారా 3.3 అడుగులు (1 మీటరు) దూరాన ఉన్న చిత్రాలను కూడా తీసేవిధంగా రూపొందించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా దీని ద్వారా భూ సర్వేలు, పట్టణ ప్రణాళిక, రహదారుల నిర్మాణాల ప్రణాళికలను రూపొందించటం, పంటల దిగుమతులను అంచనా వేయవచ్చని పేర్కొంది. విపత్తు సమయంలోనూ ఈ శాటిలైట్​ ఎంతగానో ఉపయోగపడుతుందని మీడియా స్పష్టం చేసింది.

మరో ఉపగ్రహం పేరు 'హెడ్​-4'. ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్​కు మద్దతుగా దీనిని రూపొందించారు. కక్ష నుంచి అనుసంధానమైన పరికరాలకు సమాచారాన్ని చేరవేస్తుంది.

ఇదీ చూడండి:అన్​లాక్​ 1.0: సోమవారం ఆతిథ్యం, పర్యటకం షురూ

ABOUT THE AUTHOR

...view details