china landslide news: నైరుతి చైనా గుయిజౌలోని ఓ నిర్మాణ ప్రదేశంలో కొండచరియలు విరిగిపడి 14మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే గుయిజౌ.. చైనాలోనే అత్యంత తక్కువగా అభివృద్ధి చెందిన ప్రదేశాల్లో ఒకటి. ప్రమాద సమయంలో.. ఆ ప్రాంతంలో ఓ ఆసుపత్రికి సంబంధించిన శిక్షణా కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.