తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమెరికా వెళ్లేందుకు వారు కూడా ఆసక్తిగా లేరు' - అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంపై చైనా రిప్లై

అమెరికా తీసుకొచ్చిన తాజా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని చైనా గ్లోబల్ టైమ్స్ సంపాదకుడు హు షిజిన్ తప్పుబట్టారు. కమ్యునిస్టు పార్టీతో సంబంధాలను బట్టి దేశంలోకి అనుమతించే విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కమ్యునిస్టు పార్టీ సభ్యత్వం లేని వారు కూడా అమెరికా వెళ్లేందుకు ఆసక్తిగా లేరని ట్వీట్ చేశారు.

China irked over US' new policy guidance against 'Communist Party'
'అమెరికా వెళ్లేందుకు వారు కూడా ఆసక్తిగా లేరు'

By

Published : Oct 5, 2020, 12:49 PM IST

కమ్యునిస్టు పార్టీ సహా నియంతృత్వ పార్టీలతో సంబంధాన్ని బట్టి ఇతర పౌరులకు దేశంలోకి అనుమతించేందుకు అమెరికా తీసుకొచ్చిన విధానాన్ని చైనా వ్యతిరేకించింది. ఈ విధానంపై చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్​ ఎడిటర్ హు షిజిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే, ప్రతిభావంతులను చైనాలోనే ఉంచేందుకు తాజా విధానం సహాయపడుతుందని అన్నారు.

"చైనాలోని చాలా మంది ప్రతిభావంతులు చైనా కమ్యునిస్టు పార్టీలో సభ్యులు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రతిభావంతులను చైనాలో ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ నిర్ణయం వారి భ్రమను తెలియజేస్తోంది. కమ్యునిస్టు పార్టీ సభ్యులు కానివారు కూడా అమెరికాకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు."

-హు షిజిన్, గ్లోబల్ టైమ్స్​ ఎడిటర్

కమ్యునిస్టు పార్టీ, లేదా ఇతర నియంతృత్వ పార్టీలతో సభ్యత్యం, అనుబంధం ఉన్న వ్యక్తులకు అనుమతి నిరాకరించే విధానంపై అమెరికా పౌరతస్వం, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం శుక్రవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే చైనా, అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనా సహా హాంకాంగ్ భద్రత చట్టం, ఉయ్​గుర్​ల పట్ల చైనా ప్రవర్తనపై అమెరికా ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం తాజా విధానం రూపొందించింది.

ఇదీ చదవండి-'బైడెన్​కే ప్రవాసీల మద్దతు- గుజరాతీలు మాత్రం...'

ABOUT THE AUTHOR

...view details