తెలంగాణ

telangana

ETV Bharat / international

'9వ విడత​ చర్చలకు భారత్-చైనా సంప్రదింపులు' - China-India border tensions

చైనాతో సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో మరోసారి చర్చలు జరపడానికి భారత్​-చైనా మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని చైనా రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.

China, India in talks to hold 9th round of Commander-level meet on Ladakh standoff: Def Ministry
మరోసారి చర్చలకు సిద్ధమే:చైనా

By

Published : Dec 31, 2020, 9:52 PM IST

సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు తొమ్మిదో విడత కమాండర్​ స్థాయి చర్చలు జరపడానికి భారత్​-చైనాలు సమాలోచనలు చేస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణపై మరోసారి చర్చించడానికి ఇరుదేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని చైనా రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్​ టాన్​ కేఫీ. సైనికాధికారులు, దౌత్య మార్గాలు ద్వారా భారత్​తో చర్చలు జరపడానికి చైనా సుముఖంగా ఉన్నట్లు టాన్​ పేర్కొన్నారు.

ఏకాభిప్రాయాన్ని అమలు చేయాలి

ఒకే లక్ష్యం కోసం భారత్​.. చైనాతో కలిసి పనిచేస్తుందన్న టాన్​.. కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశాల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతను మరింత తగ్గించడానికి ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలన్నారు.

సరిహద్దుల్లో ప్రతిష్టంభనపై ఇరు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అయితే ఈ నెల 18న విదేశాంగ అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో బలగాల ఉపసంహరణకు ఇరుదేశాలు అంగీకరించాయి. అలాగే మరోమారు చర్చలు జరపాలని కూడా నిర్ణయం తీసుకున్నాయి.

ఇదీ చూడండి:పాక్​కు 11 లక్షల చైనా టీకా డోసులు!

ABOUT THE AUTHOR

...view details