భారత్ అధీనంలో ఉన్న తమ జవాను.. త్వరగా విడుదలవుతాడని చైనా సైన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే భారత్‌తో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించింది.
"ఈ నెల 18న చైనా-భారత్ సరిహద్దు ప్రాంతంలో గల్లంతైన జవాను ప్రస్తుతం భారత్ అధీనంలో ఉన్నాడు. స్థానికుల అభ్యర్థన మేరకు వారి జడల బర్రెను తిరిగి తీసుకొచ్చే క్రమంలో జవాను గల్లంతయ్యాడు. అందువల్ల మా దేశ సైనికుడిని భారత్ త్వరగా విడుదల చేస్తుందని ఆశిస్తున్నాం."
-- కల్నల్ జాంగ్ షుయిలి, పీఎల్ఏ కమాండర్.
ఈ పూర్తి వ్యవహారంపై సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది భారత సైన్యం. తూర్పు లద్దాఖ్‌లోని దెమ్‌చోక్ వద్ద కార్పరల్ స్థాయి చైనా సైనికుడైన వాంగ్ యా లాంగ్‌ను గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. అతని వద్ద పౌర, సైన్యానికి సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఆ సైనికుడు గూఢచారిగా భారత్‌కు వచ్చాడా? లేక మరే ప్రణాళికతోనైనా వచ్చాడా? అన్న అంశంపై విచారణ చేపట్టినట్టు స్పష్టం చేసింది. విచారణ అనంతరం ప్రోటోకాల్ ప్రకారం సైనికుడిని చైనాకు అప్పగించనున్నట్టు వివరించింది.
ఇదీ చూడండి:-కశ్మీర్‌ను చైనాలో భాగంగా చూపిన ట్విట్టర్!