చైనా దూకుడుపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో తాజా సమావేశంలో జిన్‌పింగ్ స్పందించారు. తమది శాంతికాముక దేశమని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయిన (Biden XI meeting) చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇప్పటివరకు తమకు తాముగా ఒక్క యుద్ధాన్ని కూడా ప్రారంభించలేదు. ఇతర దేశాలకు చెందిన అంగుళం భూభాగాన్నీ ఆక్రమించుకోలేదు. మా దేశ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పరిరక్షించుకుంటాం. మా ఎదుగుదలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు"
-- షీ జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు