తమ కొత్త సరిహద్దు చట్టం (china new policy2021) ప్రస్తుతమున్న ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం చూపదని చైనా స్పష్టం చేసింది. కొత్త చట్టం, సరిహద్దుల విషయంలో తమ వైఖరి మారబోదని వెల్లడించింది. తాము తెచ్చిన సాధారణ చట్టంపై ఊహాగానాలు చేయడం మానుకోవాలని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి తెలిపారు.
భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభన కొనసాగుతున్న క్రమంలో చైనా ఓ కొత్త చట్టాన్ని ఆమోదించింది. దీంతో చైనా ఏకపక్షంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని భారత్ ఆరోపించింది. సరిహద్దును మార్చే చర్యలను మానుకోవాలని తెలిపింది. భారత్ ఆరోపణలపై చైనా విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది.