తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమెరికా... నిప్పుతో గేమ్స్‌ వద్దు'

అమెరికా-చైనాల వివాదం తారస్థాయికి చేరింది. అమెరికా ప్రతినిధులు తైవాన్​ సందర్శించడంపై మండిపడిన చైనా.. తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య బంధం అట్టడుగు స్థాయికి పడిపోయిన నేపథ్యంలో.. ఇలాంటి హెచ్చరికలు రావడం చర్చనీయాంశమైంది.

China has issued stern warnings to the US
అమెరికా... నిప్పుతో గేమ్స్‌ వద్దు.!: చైనా హెచ్చరిక

By

Published : Aug 12, 2020, 11:11 PM IST

అమెరికా, చైనాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఇటీవల అమెరికా ప్రతినిధులు తైవాన్‌ను సందర్శించడంపై చైనా మండిపడింది. 'నిప్పుతో చెలగాటమాడొద్దు' అని అమెరికాను హెచ్చరించింది. అమెరికా-చైనాల బంధం అధమస్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు రావడం గమనార్హం. ఇటీవలే అమెరికా ఆరోగ్యవిభాగ చీఫ్‌ అలెక్స్‌ అజర్‌ తైవాన్‌లో మూడు రోజుల పాటు పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా కరోనావైరస్‌ విషయంలో చైనాతీరుపై ఆయన విమర్శలు చేశారు.

వ్యతిరేకించిన చైనా..

అజర్‌ పర్యటనపై బుధవారం చైనా ప్రతినిధి స్పందించారు. తైవాన్‌, అమెరికా మధ్య అధికారుల రాకపోకలను చైనా వ్యతిరేకించింది.

'పూర్తిగా చైనాకు సంబంధించిన అంశాల్లో అమెరికా అనవసరమైన భ్రాంతులను సృష్టిస్తోంది. నిప్పుతో చెలగాటం ఆడితే కాలుతుంది. నేను తైవాన్‌ అధికారులకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరికో బానిసలుగా ఉండొద్దు. విదేశీయుల మద్దతు పై ఆధారపడి స్వతంత్రం కోసం ఆరాటపడితే అది ముగింపు అవుతుంది.' అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రెండు వారాల్లో రష్యా టీకా తొలి బ్యాచ్‌ రెడీ

ABOUT THE AUTHOR

...view details