భారత్ నుంచి తన పౌరులను స్వదేశానికి తరలించాలని చైనా నిర్ణయించింది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో 'ఇబ్బందులు' పడుతున్న తమ విద్యార్థులు, పర్యటకులు, వ్యాపారవేత్తల కోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. వీరి కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తోంది. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న వారంతా వీటిలో టికెట్లు బుక్ చేసుకోవాలని చైనా రాయబార కార్యాలయం సోమవారం తన వెబ్‌సైట్‌లో ఒక నోటీసు పెట్టింది. స్వదేశంలోకి అడుగుపెట్టాక వారు క్వారంటైన్ సహా మహమ్మారి నియంత్రణకు సంబంధించిన అన్ని నిబంధనలకు కట్టుబడాలని స్పష్టంచేసింది. గత 14 రోజుల్లో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ ప్రత్యేక విమానాల్లోకి ప్రవేశం లేదని తేల్చి చెప్పింది. విమాన టికెట్, క్వారంటైన్ ఖర్చులను ఎవరికివారే భరించాల్సి ఉంటుందని తెలిపింది. భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా తాజా నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.
భారత్ నుంచి చైనా పౌరులు వెనక్కి - చైనా
కరోనా మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్లో ఉంటున్న తమ పౌరులను స్వదేశానికి తరలించాలని చైనా నిర్ణయించింది. ముఖ్యంగా విద్యార్థులు, పర్యటకులు, వ్యాపారవేత్తల కోసం ఈ వెసులుబాటు కల్పించింది. అయితే కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రం ఈ సౌలభ్యం లేదని స్పష్టం చేసింది.
భారత్ నుంచి చైనా పౌరులు వెనక్కి