కరోనా పుట్టుకకు కేంద్ర బిందుమైన చైనాలో వైరస్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ రోజువారీ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గగా.. మంగళవారం 16 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్(ఎన్‌హెచ్‌సీ) ప్రకటించింది. వీరందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని.. ఇందులో 15 మందికి వ్యాధి లక్షణాలేమీ లేకున్నా వైరస్ పాజిటివ్‌గా తేలిందని అధికారులు పేర్కొన్నారు. స్థానికంగా ఎవరికీ వైరస్ సోకలేదని వెల్లడించారు. కొవిడ్-19తో కొత్తగా ఎవరూ మరణించలేదని స్పష్టం చేశారు.
చైనాలో ఇప్పటివరకు మొత్తం 82,881 మందికి వైరస్ సోకింది. 4,633 మంది ప్రాణాలు కోల్పోయారు. 77,853 మంది మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. అక్కడ ప్రస్తుతం 395 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
పాకిస్థాన్‌లో 21వేలకుపైనే...
పాకిస్థాన్‌లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 1315 మందికి వైరస్ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 21,501కి చేరింది. కొత్తగా 24 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కరోనాకు బలైన వారి సంఖ్య 486కు చేరింది.
దేశంలో కేసులు పెరుగుతున్నప్పటికీ.. లాక్డౌన్ ఆంక్షలను సడలించనున్నట్లు తెలిపారు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. లాక్‌డౌన్‌ను ఇలాగే కొనసాగిస్తే.. దేశ మనుగడ కష్టమన్న ఆయన.. క్రమంగా వీటిని ఎత్తివేస్తామని సోమవారమే ప్రకటించారు.